కుక్కలు కరిచేముందు ఇలా చేస్తాయట.. ఆ పొజిషన్‌లో ఉన్న కుక్కలను అస్సలు గెలకకండి..!

-

రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు కనిపిస్తే మనకు వెంటనే భయం వేస్తుంది. అది ఎక్కడ కరుస్తుందేమో అని. మన మొఖంలో భయం చూస్తే… కుక్కలు ఇంకా ఓవర్‌ యాక్షన్‌ చేస్తాయి. అదే పనిగా అరిచి ఇంకా భయడతాయి. అప్పుడే కరుస్తాయి కూడా. అరిచే కుక్కలు కరవు అని, కరిచే కుక్కలు అరవవు అని ఏదో మాటవరసకు అంటారు. అయితే కుక్క ఎప్పుడు కొరికేస్తుందో కొన్ని అంచనాలను తెలుసుకోవడం ద్వారా మీరు కుక్క కాటు నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

సాధారణంగా దూకుడుగా ఉండే కుక్కను చూస్తే.. ఈ కుక్క కరుస్తుందనే అనుకుంటారు. ఎందుకంటే అవి బిగ్గరగా అరుస్తాయి. కానీ కొన్ని కుక్కలు కరిచేందుకు వేరే కారణాలు ఉంటాయి. ఒక కుక్క సంతోషంగా ఉన్నప్పుడు, అది దాని మొత్తం శరీరాన్ని కదిలిస్తుంది. తోకను ఊపుతుంది. కాలు ఎత్తుతుంది కానీ కుక్క కదలకపోతే, చూస్తూ ఉంటే, కుక్క మంచి మానసిక స్థితిలో లేదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ కుక్క మిమ్మల్ని ఎప్పుడైనా కరవొచ్చు.

కుక్క శరీరంపై వెంట్రుకలు నిలబడకపోతే అది మిమ్మల్ని కరుస్తుంది. వీధి కుక్క అయితే దూరంగా ఉండండి. అదే పెంపుడు కుక్క అయితే.. మీ చేతులతో కుక్కను నిమరడానికి ప్రయత్నించండి. కాసేపటికి మీవైపు చూస్తే కాటు వేయకపోవచ్చు. రిస్క్‌ ఎందుకనుకుంటే.. దాని నుంచి దూరంగా వెళ్లండి. కుక్క కాటు వేయకముందే దాని దృష్టి మారుతుంది. కుక్కలకు కోపం వస్తే వాటి కళ్ళు పూర్తిగా మారిపోతాయి. కళ్లలో తెల్లసొన ఎక్కువగా కనబడుతుంది అంటే కుక్క కొరికేస్తుంది అని తెలుసుకోవాలి.

కుక్క నిద్రపోతున్నప్పుడు లేపకండి. నిద్రపోయేటప్పుడు వాటిని కౌగిలించుకుంటే, అవి భయంతో మిమ్మల్ని కొరుకుతాయి. కుక్కలకు ఆహారం పెట్టేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కూడా అవి కరిచే అవకాశం ఉంటుందట.

ముఖ్యంగా మీరురోడ్డుపై వెళ్తున్నప్పుడు కుక్క కనబడగానే.. మీ ముఖంలో ఎక్సప్రెషన్స్‌ మార్చకండి. అస్సలు భయపడకూడదు, వణకకూడదు, నడక తబడిందా అంతే..? అప్పటివరకూ ఎలా క్యాజువల్‌గా ఉన్నారో అలానే నడుచుకుంటూ వెళ్లిపోండి. అప్పుడు అవి మీజోలికి రావు. మీరు వాటిని చూడగానే.. భయంతో ఏ కట్టె తీసుకొని కొట్టేద్దాం అనుకుంటే..అది కచ్చితంగా మీమీదకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news