అలా చేస్తే సెక్సువల్ హరాస్ మెంట్ కాదట….

-

చాలా మంది స్త్రీలు ప్రస్తుత రోజుల్లో సెక్సువల్ గా వేధించబడుతున్నారు. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నప్పటికీ స్త్రీలు వేధించబడేది మాత్రం వాస్తవం. ఇలా అనేక ప్రాంతాల్లో స్త్రీలు ఆట బొమ్మలవలె మగవారి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. స్త్రీలను ఇలాంటి వేధింపుల నుంచి బయట పడేసేందుకు చాలా చట్టాలను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీలు నేటికీ అనేక ప్రాంతాల్లో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఏదో ఒక చోట నిత్యం తనువు చాలిస్తూనే ఉన్నారు. స్త్రీలు ఇలా వేధింపులకు గురై మరణించిన ప్రతి సారీ వ్యక్తులు, వ్యవస్థలు అయ్యో పాపం! అని అనుకుంటూ సరిపెడుతున్నారు. కానీ ఈ నేరాల తగ్గుదలకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

కొంత మంది స్త్రీలను లైంగికంగా వేధిస్తే.. కేసులు మనల్ని వదలవు అనే భయంతోనైనా దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ భయాన్ని కూడా కోర్టులు పోగొడుతున్నాయి. తాజాగా అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం, చేయి పట్టుకుని ప్రపోస్ చేయడం సెక్సువల్ హరాస్ మెంట్ కిందకు రావని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా చేయడం సరికాదని చాలా మంది అంటున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే… ఓ 28 సంవత్సరాల వ్యక్తి… ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించసాగాడు. అతడు ఆమె చేతిని పట్టుకుని ప్రపోస్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు 2017లో ఆ వ్యక్తి పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసులో తీర్పు వెలువరించిన న్యాయస్థానం మైనర్ బాలిక చేతిని పట్టుకుంటే అది సెక్సువల్ హరాస్ మెంట్ కిందకు రాదని తీర్పును వెలువరించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version