హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయం.. థాంక్స్ చెబుతూ కేటీఆర్ ట్వీట్ !

-

హుజూరాబాద్ నియోజకవర్గం లో బి జె పి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అద్భుత విజయం సాధించారు. హుజూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ పై ఏకంగా 22,735  ఓట్ల  మెజారిటీతో ఈటల రాజేందర్ విజయఢంకా మోగించారు. 21 వ రౌండ్ లోనూ ముగిసే సారికి  బీజేపీకి  1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఈటల గెలుపు ఫైనల్ అయింది.

ఆ రౌండ్ లేదు..ఈ రౌండ్ లేదు…రౌండ్ రౌండ్‌కు ఈటలదే ఆధిక్యం…ఆ మండలం లేదు..ఈ మండలం లేదు…అన్నీ మండలాల్లోనూ ఈటలదే హవా. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు…హుజూరాబాద్ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈటలని గెలిపించారు.

అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… స్పందించారు.

etala

 

హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక లో పనిచేసిన నేతలకు కృతజ్ఞతలు చెప్పారు మంత్రి కేటీఆర్. అలాగే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లకు ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పారు మంత్రి కేటీఆర్. హుజరాబాద్ లో కష్టపడ్డ ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు , క్యాడర్ కు ధన్యవాదములు తెలిపారు. అలాగే సోషల్ మీడియా వారియర్స్ కి అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. గడచిన 20 ఏళ్లలో టిఆర్ఎస్ ఎన్నో ఎత్తు…పల్లలను చూసిందని..ఈ ఉప ఎన్నిక ఫలితం పెద్దగా ప్రభావం చూపదు..ప్రాధాన్యత ఉండదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news