ఈ మధ్య కాలం లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు స్కీముల లో డబ్బులు పెడుతున్నారు నిజానికి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి స్కీములు మనకి సహాయం చేస్తాయి. భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితాన్ని గడపడానికి ఇటువంటి పథకాలు మనకి ఉపయోగపడతాయి.
ఇప్పటి వరకు చాలా స్కీములు మనకి అందుబాటులోనే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ కూడా వివిధ రకాల స్కీములని అందుబాటు లోకి తీసుకు వచ్చింది పోస్ట్ ఆఫీస్ తీసుకువచ్చిన ఈ స్కీముల లో డబ్బులు పెట్టడం వలన అదిరే లాభాలను పొందడంతో పాటుగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.
పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తీసుకు వచ్చిన పథకాల లో కిసాన్ వికాస్ పత్రా స్కీమ్ కూడా ఒకటి ఈ స్కీం లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. కొంత నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టాలి దీనిలో మీరు ఎంత పెట్టుబడి అయితే పెడతారో అది కొంత కాలానికి రెట్టింపు అవుతుంది. ఈ స్కీం వలన అదిరే లాభాలను మీరు పొందొచ్చు ఇక ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం.
ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అర్హులే. మైనర్ ఈ పథకాన్ని పొందాలి అనుకుంటే సంరక్షకుడి పేరు మీద ఈ పథకాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను హామీ ఇస్తూ రుణం పొందే అవకాశం కూడా ఈ స్కీమ్ తో పొందవచ్చు. రుణానికి రిటర్న్స్ లో పన్ను కట్టవలసి ఉంది. పెట్టుబడులు పెట్టిన 10 సంవత్సరాలకు డబ్బులు రెట్టింపు అవుతాయి. 1000 నుండి దీనిలో మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఈ పథకానికి ఏడాదికి 7.2 % వడ్డీ వస్తుంది. 120 నెలలో డబ్బు రెట్టింపు అవుతుంది.