బండికి ట్రాప్..బీఆర్ఎస్ డైవర్షన్..కేసీఆర్ స్కెచ్ సక్సెస్.!

-

ఎలాంటి వ్యతిరేక పరిస్తితులైన సరే తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కే‌సి‌ఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. అప్పటికప్పుడు తమకు ఉన్న వ్యతిరేకతని సానుకూలంగా మార్చుకోవడంలో కే‌సి‌ఆర్ ధిట్ట. అలాగే రివర్స్ లో ప్రత్యర్ధులని దెబ్బకొట్టగల సత్తా ఉన్న నాయకుడు. లేటెస్ట్ గా కే‌సి‌ఆర్..కవిత విషయంలో అదే చేశారనే చెప్పాలి.

అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుకున్నారు..ఆమెని ఈడీ విచారణకు పిలిచింది..అంటేనే కవిత విషయంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాజకీయం చేసి కే‌సి‌ఆర్‌ని ఇరుకున పెట్టవచ్చు. కానీ అది జరగలేదు..రివర్స్ లో బి‌జే‌పినే ఇరుకున పెట్టారు. కవిత ఈడీ విచారణకు వెళ్ళిన రోజున కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓ వైపు తన కుమార్తెకు మద్ధతు నేతలందరిని ఢిల్లీకి పంపడం..అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో ఓ అంశంపై బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేసి రాజకీయం నడిపించారు.

ఎప్పుడో మార్చి 8న బండి సంజయ్..కవితని ఈడీ విచారణకు పిలవడంపై స్పందిస్తూ..అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని కామెంట్ చేశారు. అయితే అదొక సామెత మాదిరిగా చెప్పారు. అయితే బండి ఆ మాట అన్న రోజు బి‌ఆర్‌ఎస్ వాళ్ళు స్పందించలేదు. కరెక్టుగా మార్చి 11 కవిత ఈడీ విచారణకు వెళ్ళిన రోజున బి‌ఆర్‌ఎస్ శ్రేణుల చేత..బండి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించారు. బండి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. అంటే కవిత ఇష్యూని డైవర్ట్ చేశారు.

అది ఎంతలా డైవర్ట్ చేశారంటే సొంత బి‌జే‌పి నేతలే..కవితపై బండి చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పేవరకు. అంటే కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూ పోయింది..ఇంకా బండిని పట్టుకున్నారు. పైగా ఇప్పుడు ఆయనని మహిళా కమిషన్ విచారణ పిలిచే వరకు వచ్చింది. అంటే కే‌సి‌ఆర్ రాజకీయ క్రీడ ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news