జగన్ సన్నిహితుడుకే సీటు డౌట్?

-

ఇటీవల వచ్చిన జాతీయ మీడియా సర్వేలకు…ఏపీలో క్షేత్ర స్థాయిలో పరిస్తితులు పెద్దగా పొంతన ఉన్నట్లు కనిపించడం లేదు. నేషనల్ సర్వేలు ఏమో..వైసీపీ 17 నుంచి 23 ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు అని చెప్పాయి.  కానీ క్షేత్ర స్థాయిలో మళ్ళీ వైసీపీ తరుపున అంతమంది ఎంపీలు గెలుస్తారనేది డౌట్ గా ఉంది. గత ఎన్నికల్లోనే ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలని ఇచ్చారు. మరి వారి వల్ల ఇప్పుడు రాష్ట్రానికి ఒరిగింది ఏంటో తెలియడం లేదు. వారు కేంద్రంతో పొరాడి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో…సొంత పార్టీ వాళ్లే చెప్పలేని పరిస్తితి.

అసలు టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే వారు ఏదొకరకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆ ముగ్గురు హైలైట్ అయినట్లు వైసీపీలో ముగ్గురు ఎంపీలుగా కూడా హైలైట్ కాలేదు. మరి అలాంటప్పుడు నెక్స్ట్ వైసీపీ 17 పైనే ఎంపీలని ఎలా గెలుచుకోగలదు అనేది పెద్ద ప్రశ్నే. అయితే పనితీరు బాగోని ఎంపీలకు జగన్ సీటు మాత్రం ఇవ్వరని తెలుస్తోంది.  వారి స్థానాల్లో కొత్త వారిని బరిలో దించుతారని సమాచారం.

వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు…అందులో రఘురామ రెబల్…ఆయన ప్లేస్‌లో వేరే నేతని దించాలి…ఇక మిగిలిన 21 మంది ఎంపీల్లో 11 మందికి మళ్ళీ సీటు రాదని తెలుస్తోంది. ఎంత కాదు అనుకున్న ఓ 8-9 మందికి సీటు అయితే డౌటే. ఇదే క్రమంలో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు నందిగం సురేష్‌కు డౌట్ లేకుండా సీటు రాదని ప్రచారం జరుగుతుంది.

గత ఎన్నికల్లోనే బాపట్ల నుంచి చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు. ఇక ఎంపీగా ఆయన బాపట్లకు ఏం చేశారో ఎవరికి తెలియదు…కాకపోతే మీడియా ముందుకొచ్చి చంద్రబాబుపై విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు. అయితే ఈయనకు మళ్ళీ సీటు ఇస్తే బాపట్లలో వైసీపీ ఓడిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు. అందుకే నందిగం సురేష్‌కు ఈ సారి సీటు ఉండదని అంటున్నారు. జగన్ సన్నిహితుడు కాబట్టి వేరే సీటుకు పంపిస్తారా? లేదా అసెంబ్లీ సీటు ఇస్తారా? అనేది తెలియదు. బాపట్ల మాత్రం మళ్ళీ ఇవ్వరని ఖచ్చితంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news