కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా? ప్రాణాల పోతాయట..ఇది చూడండి..

-

కొబ్బరి నీళ్ళల్లో మినరల్స్, విటమిన్స్ తో పాటు శరీరానికి కావలసిన అన్నీ ఫొషకాలు పుష్కలంగా ఉన్నాయి.. దాంతో ఆరోగ్య నిపుణులు రోజూ కొబ్బరి బొండం తాగడం మంచిదని అంటున్నారు..ఇది అక్షరాల నిజం..కానీ ఇప్పుడు ఓ వార్త ప్రచారంలో ఉంది.. కొబ్బరి నీళ్ళు తాగి ఓ వ్యక్తి చనిపోయాడు.కొన్ని గంటల్లోనే బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. అసలు ఏం జరిగింది, కొబ్బరి నీళ్లు అతడి మరణానికి ఎలా కారణం అయ్యిందో ఇప్పుడు చూద్దాం..

 

డెన్మార్ దేశానికి చెందిన 69 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉన్న కొబ్బరి నీళ్లను తాగాడు, కొంతసేపటికే అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఏసీ కొన్ని రోజుల క్రితం సూపర్ మార్కెట్ నుంచి ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తెచ్చుకున్నాడు. ఈ కొబ్బరి నీళ్లను కూడా బోడాంలోనే ఇచ్చారు. అయితే దీనిని రీఫ్రిజరేటర్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఈ వ్యక్తికి తెలియక మామూలు కొబ్బరిబోండాం లాగే వంటగదిలో ఒక మూలన పెట్టేశాడు.

రెండు మూడు వారాలు గడిచాయి, ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొబ్బరినీళ్లు తాగుదామనిపించి, వెంటనే అతడు దాచుకున్న కొబ్బరిబోండాం తీసి స్ట్రా వేసి తాగాడు. అయితే ఆ నీళ్లు చాలా చెడుగా, కుళ్లిపోయిన రుచిని కలిగి ఉన్నాయి..ఆ వెంటనే అతను ఊసివెసి నీళ్ళతో పుక్కిలించాడు..కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది..అతని నోట్లోకి నీళ్ళు కొద్దిగా వెళ్ళాయి.
అతడు ఆ కొబ్బరిబోండాంను తొలచి చూడగా అది పూర్తి కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. అవే నీటిని తెలియకుండా ఈ వ్యక్తి కొంత తాగేశాడు. వెంటనే ఏసీ తన భార్యను పిలిపించి తాను తాగిన కొబ్బరిబోండాంను విప్పి చూపించాడు. ఆ కొబ్బరిబోండాంను రిఫ్రిజిరేటర్‌లో 4°C-5°C నిల్వ చేయాలని ఉంది. బయట పెట్టడంతో అది కుళ్లిపోయింది..

అవి తాగిన తాగిన మూడు గంటల తర్వాత ఏసీలో వింత లక్షణాలు కనిపించాయి. అతడికి తీవ్రంగా చెమటలు పట్టడం, వికారం, వాంతులు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లోనే అతడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించింది. అయినప్పటికీ రెండు గంటల తర్వాత పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. ఆ తర్వాత అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, చివరకు బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు వైద్యులు తెలిపారు..అందుకే ఏదైనా తాజాగా తీసుకోవడం మంచిది..లేకుంటే ప్రాణాలు పోతాయి..ఈ ఆర్టికల్ చదివిన వాళ్లంతా షాక్ అవ్వడం ఖాయం కానీ ఇది నిజం..జాగ్రత్త సుమీ..

Read more RELATED
Recommended to you

Latest news