డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల విషయంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో కేవలం రాత్రి సమయాల్లోనే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ తాజా గా హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంతో పగులు కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయనున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది.
దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హీల్స్, బంజారా హీల్స్, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, అబిడ్స్, కోఠీ, చిక్కడ పల్లి, అంబర్ పేట్, నారాయణ గూడ, లిబర్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు తో పాటు మరి కొన్ని ప్రాంతాలలో ఇక నుంచి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.