మళ్ళీ అధికారం..ఇదే ఇప్పుడు జగన్ లక్ష్యం..గత ఎన్నికల్లో భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. అప్పటివరకూ అధికారంలోకి రాలేదు కాబట్టి..ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఏంటో చూడండి అని జనాలని ఓట్లు అడిగి జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ పాలన ఏంటో ప్రజలు చూస్తున్నారు. దీంతో మళ్ళీ ఛాన్స్ అని జగన్ అడగడటానికి లేదు..కానీ తన అమలు చేస్తున్న సంక్షేమం ఏంటో చూసి ఓట్లు వేయాలని జగన్ కోరుతున్నారు.
ఇప్పుడు జగన్ నమ్ముకున్న అస్త్రం అదే..సంక్షేమం..ఇదే తనని మళ్ళీ గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఓ వైపు చంద్రబాబు-పవన్ కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు. ఎలాగైనా జగన్ కు చెక్ పెట్టాలని చెప్పి పొత్తు దిశగా వెళుతున్నారు. దీంతో వైసీపీలో కాస్త టెన్షన్ ఉంది. టిడిపి-జనసేన పొత్తు ఉంటే కాస్త దెబ్బ తగలడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విషయం జగన్ కు కూడా తెలుసు. అందుకే ఎలాగైనా పొత్తు లేకుండా చేయాలని..వారికి దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు.
అలా చేస్తే వారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకీ బెనిఫిట్ అవుతుంది. అదే ఉద్దేశంతో జగన్ ముందుకెళుతున్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా సరే..అదిగో వారంతా కలిసి వస్తున్నారు..తాను మాత్రం ఒంటరిగా పోరాడుతున్నానని ప్రజల్లో సానుభూతి పెంచేలా ముందుకెళ్లెలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాగ్రౌండ్ లో ఆ దిశగా కూడా వర్క్ జరుగుతుందట.
ఇక సంక్షేమం వల్ల ప్రతి ఇంటికి లక్షల్లో లబ్ది జరిగిందని, ఇప్పుడు వారే వైసీపీకి ఓటు వేస్తారని జగన్ నమ్మకం పెట్టుకుని ముందుకెళుతున్నారు. వారే ఎలాగైనా గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు. మరి జగన్ ధీమా నిజమవుతుందో లేదో చూడాలి.