కమల్ హాసన్ మూవీలో దుల్కర్ సల్మాన్, త్రిషలు !

-

లేట్ వయసులోనూ అదరగొడుతున్న హీరోలలో చిరంజీవి, రజినీకాంత్ లతో పాటుగా కమల్ హాసన్ కూడా ఒకరు. గత సంవత్సరం కమల్ హాసన్ లోకేష్ కానగరాజ్ తో తీసిన విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు కమల్ హాసన్… ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో ఉండగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఒక మూవీ ని చేయనున్నారు. ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ప్రేక్షకులను హ్యాపీ చేస్తోంది అని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం మణిరత్నం మరియు కమల్ హాసన్ కంబోలో రానున్న ఈ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ మరియు సీనియర్ హీరోయిన్ త్రిషలు నటించనున్నారట. కాగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది.

కానీ మణిరత్నం ఈ మధ్యన తీసిన పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లు కూడా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలం అయినందున ఈ సినిమాపై అంతగా అంచనాలు ఉండవనే సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version