గుడ్ న్యూస్… ఇలా ఈజీగా ఈ-పాస్‌బుక్ ఫీచర్ తో ఎన్నో సేవలు పొందండి..!

-

పోస్టాఫీసు ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. వీటి వలన మనకి ఎన్నో ఉపయోగాలు వున్నాయి. చాలా మంది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. మీరు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మీకోసమే ఈ-పాస్‌బుక్ ఫీచర్ ని పోస్ట్ ఆఫీస్ తీసుకు వచ్చింది. వీటితో అకౌంట్ హోల్డర్లకు డిజిటల్ సౌకర్యాలను ఈజీ చేసేసింది. ఈ నెల పన్నెండు నుండే ఈ-పాస్‌బుక్ ఫెసిలిటీని పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టింది. అయితే ఈ-పాస్‌బుక్ ఫీచర్‌ను స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టె కస్టమర్స్ పొందచ్చట. ఇక ఎలాంటి సేవలను పొందచ్చనేది కూడా చూద్దాం.

బ్యాలెన్స్ ఎంక్వైరీ:

ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌తో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడచ్చట.

మినీ స్టేట్‌మెంట్:

పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా స్కీమ్స్ కి సంబంధించి మినీ స్టేట్మెంట్ ని కూడా ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌తో పొందొచ్చు. ఆఖరి 10 లావాదేవీలను పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చెయ్యచ్చు.

కస్టమర్స్ కనుక ఈ సర్వీసులను పొందాలంటే మొబైల్ నెంబర్‌ను పోస్టాఫీసు వద్ద రిజిస్టర్ చెయ్యాల్సి వుంది. దానితో ఈజీగా కస్టమర్లు ఈ సేవలను పొందేందుకు అవుతుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఆఖరి 10 లావాదేవీలను పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version