తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్షలను నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొదటిరోజు మొత్తం 57,577 మంది పరీక్ష రాశారు. ఇందులో ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మంది పరీక్ష రాశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.