వరస భూకంపాలు ఇండియాను భయపెడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం గడ్చిరోలి కేంద్రంగా భూకంపం సంభవించిందని తెలిపింది. దీని ఫలితంగా మహాారాష్ట్ర గడ్చిరోలి జిల్లాను అనుకుని ఉన్న తెలంగాణ సరిహద్దు జిల్లాలోనూ భూమి కంపించింది. కుమ్రభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూకంప తీవ్రతను ఈ జిల్లాలు ఎదుర్కొన్నాయి. ముఖ్యం గడ్చిరోలి జిల్లాలను అనుకుని ఉన్న చెన్నూర్, వేమనపల్లి, కోటపల్లి, బెజ్జూర్, కౌటాల, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. హఠాత్తుగా భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు భయటకు పరుగులు తీశారు. గత వారం కూడా మంచిర్యాల జిల్లాలో భూమి కంపించింది. వరస భూప్రకంపాలతో ఈ జిల్లా వాసులు భయపడుతున్నారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కేంద్రంగా భూకంపం… తెలంగాణ సరిహద్దుల్లో ప్రకంపనలు
-