నీళ్లు కేసీఆర్ ఫాంహౌజ్ కి.. నియామకాలు కేసీఆర్ ఇంటికి- వైఎస్ షర్మిల

-

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ టీఆర్ఎస్ పథకాలు, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. నల్గొండ పర్యటనలో ఉన్న షర్మిళ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుధ్యోగ భ్రుతి, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూంలు ఇస్తామని హామీలిచ్చిన కేసీఆర్ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని షర్మిళ విమర్శించారు. మంచోడు… మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లారట కేసీఆర్ లాంటోళ్లు అంటూ విమర్శించారు.

Sharmila

వైెఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్గొండ జిల్లాకు 30 సార్లు వచ్చి ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించారన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారానికి క్రుషి చేశారని అన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం ద్వారా నల్గొండను సస్యశ్యామలం చేద్దాం అని అనుకున్నారని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా పేదల ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీ, 108 ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్సారే అని ఆమె అన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర లతో రైతులకు అండగా ఉన్నది వైఎస్సారే అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news