చాలామంది ఇళ్లల్లో ఎంత పరిశుభ్రత పాటిచ్చినప్పటికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఎక్కువగా ఈగల వలన ఇబ్బంది పడుతుంటారు. ఈగల కారణంగా ఇల్లంతా చికాకుగా ఉంటుంది పైగా ఏదో ఇబ్బందిగా ఉంటుంది. ఈ బాధ లేకుండా ఈగల్ని మీ ఇంటి నుండి దూరంగా ఉంచాలని అనుకుంటే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేస్తే చాలు ఈజీగా ఈగలు మీ ఇంటి నుండి వెళ్లిపోతాయి.
వానకాలంలో ఎక్కువగా ఈగలు ఇంట్లోకి వస్తే మనం తినే ఆహారం తాగే నీళ్ల పై ఈగలు వాల్తాయి. దానితో అనారోగ్య సమస్యలు మనకి కలుగుతాయి. ఒక గ్లాసు పాలల్లో ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు మూడు టీ స్పూన్ల షుగర్ వేసి కలపండి ఈగలు ఎక్కువగా ఉన్నచోట స్ప్రే చేయండి అప్పుడు ఈగలు పారిపోతాయి. బిర్యాని ఆకులతో కూడా మనం వదిలించుకోవచ్చు ఈగలు ఎక్కువగా ఉన్న చోట ఈ ఆకుల్ని కాల్చి పొగ వేస్తే ఈగలు పారిపోతాయి.
కర్పూరం తో కూడా మనం ఈగలను తరిమికొట్టొచ్చు కర్పూరం పొడి చేసి నీళ్లలో వేసి ఈ వాటర్ ని స్ప్రే చేస్తే కూడా ఈగలు రావు. అలానే తులసి ఆకుల్ని తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే కూడా ఈగలు రావు. వెనిగర్ ని కూడా మీరు ఈగలను తరిమికొట్టడానికి ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్క కూడా ఈగల్ని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. సాల్ట్ వాటర్ తో కూడా ఈగలని తరిమికొట్టేయొచ్చు ఎండు కారం కూడా ఈగల్ని దూరం చేస్తుంది.