దోమల వలన ఆరోగ్యం పాడవుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దోమల కారణంగా కలగొచ్చు. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు పడాలి. సీజన్ మారింది ఇలాంటి సమయంలో దోమలు కుట్టడం వాటర్ మారడం వంటి చిన్న చిన్న తప్పులు జరిగిన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయా… దోమల నుండి దూరంగా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి ఇలా కనుక చేశారంటే మీ ఇంటి నుండి దోమలు వెళ్ళిపోతాయి. దోమల బాధ ఉండదు.
దోమలు లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు చేరిపోతాయి. కాబట్టి మీ ఇంట్లో మీ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా మొదట చూసుకోండి. మంచానికి దోమతెరని కట్టుకుంటే దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు. కర్పూరం, వెల్లుల్లి రసం, నిమ్మ లవంగాలు ఇవన్నీ కూడా దోమలని పారిపోయేలా చేస్తాయి. వీటి ఘాటు వాసనకి దోమలు మీ ఇంట్లో చేరవు కాబట్టి ఇటువంటి ఘాటైన వాటిని మీరు ఉపయోగించొచ్చు. అప్పుడు మీ ఇంట్లో దోమలు ఉండవు. దోమలు కుట్టవు. అనారోగ్య సమస్యలు కలగవు.
వేప ఆకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి వేప చెట్టులని పెంచితే కచ్చితంగా దోమలు రావు. పసుపు కొమ్ములతో వేపాకులని కలిపి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ నిమ్మగడ్డి నూనె లావెండర్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగిస్తే కూడా దోమలు వెళ్లిపోతాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే వీటిలో దేనినైనా మీరు చర్మానికి రాసుకునే నిద్రపోవడం మంచిది.
చందనం నూనెను కానీ పసుపు పేస్ట్ ని కానీ వేపాకుల పేస్ట్ లేదంటే తులసి ఆకుల పేస్ట్ చర్మానికి రాసుకుని నిద్రపోతే దోమలు కుట్టవు. వేప నూనె కొబ్బరి నూనె కలిపి కూడా రాసుకోవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే ఖచ్చితంగా దోమలు కుట్టవు. మలేరియా జికా చికెన్ గునియా డెంగ్యూ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.