ఎడిట్ నోట్: టార్గెట్ సౌత్.!

-

మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కమలం పార్టీ గట్టిగానే కష్టపడుతుంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బి‌జే‌పి..ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో అధికారంలోకి రావడం కోసం మళ్ళీ పదునైన వ్యూహాలతో కమలం రాజకీయం మొదలుపెట్టింది. అయితే ఇప్పటివరకు బి‌జే‌పి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నార్త్ మాత్రం..ఉత్తర భారతదేశంలో సత్తా చాటడం వల్లే..బి‌జే‌పికి అధికారం దక్కుతూ వచ్చింది.

కానీ సౌత్ లో బి‌జే‌పికి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. సౌత్ లోని రాష్ట్రాల్లో బి‌జే‌పికి అంత పట్టు లేదు. దీంతో బి‌జే‌పి ఇప్పుడుయి సౌత్ పై కూడా పట్టు సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ జోన్ గా విభజించి 11 రాష్ట్రాలపై బి‌జే‌పి ఫోకస్ పెట్టింది..ఆ రాష్ట్రాల్లోని నేతలతో జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా సమావేశమయ్యారు. హైదరాబాద్ వేదికగా సమావేశం జరిగింది. ఇక సౌత్ లో 170 ఎంపీ సీట్లు గెలవడమే బి‌జే‌పి టార్గెట్ గా పెట్టుకుంది. మరి సౌత్ లో బి‌జే‌పికి అంతటి భారీ విజయం దక్కుతుందా? అంటే నో డౌట్ అసలు దక్కదనే చెప్పాలి.

 JP Nadda

ఎందుకంటే సౌత్ లో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ. పైగా సౌత్ లో కాంగ్రెస్ రేసులోకి వస్తుంది. అటు బి‌జే‌పిపై వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తుంది. సౌత్ రాష్ట్రాలకు బి‌జే‌పి న్యాయం చేయడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ సిలిండర్ ధర..ఇలా ప్రతిదీ ప్రజలపై భారం పడింది. జి‌ఎస్‌టి పెరిగింది. దీంతో బి‌జే‌పికి యాంటీ ఉంది.

ఈ నేపథ్యంలో సౌత్ లో బి‌జే‌పి 170 టార్గెట్ రీచ్ అవ్వడం అనేది అసాధ్యం. గత ఎన్నికల్లోనే బి‌జే‌పి సౌత్ లో సక్సెస్ కాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను గెలిచింది. కానీ అప్పుడు దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చింది 29 సీట్లే. కర్నాటకలో 25, తెలంగాణలో 4 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక ఏపీ, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు రాలేదు. ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో అక్కడ బి‌జే‌పికి డ్యామేజ్ జరిగేలా ఉంది.

అటు బీజేపీ సౌత్‌జోన్‌గా విభజించుకున్న ప్రాంతంలో ఇంకా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి. వీటిలో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 2019లో బీజేపీకి వచ్చినవి 23. అండమాన్‌ నికోబార్‌లో ఉన్న ఒక్కసీటునూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్కించుకుంది. లక్షద్వీ్‌పలో ఉన్న ఒక్క సీటు ఎన్సీపీకి.. గోవాలోని 2 ఎంపీ సీట్లలో బీజేపీకి ఒకటి వచ్చింది.  పుదుచ్చేరిలో ఉన్న ఒక్క ఎంపీ సీటునూ కాంగ్రెస్‌ దక్కించుకుంది. కాబట్టి సౌత్ లో టార్గెట్ 170 రీచ్ కావడం సాధ్యం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news