అసెంబ్లీ ఎన్నికలకు కేసిఆర్ అన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం..బరిలో దిగుతారు. షెడ్యూల్ రాకముందే గెలుపు గుర్రాలని కేసిఆర్ ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు 90 శాతంపైనే అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులని ఖరారు చేసినట్లు తెలిసింది. రేపో మాపో మొదట లిస్టుని కూడా విడుదల చేస్తారు. ఇక దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు మొదట లిస్టులో ఉంటాయని తెలుస్తోంది.
అయితే కొంతమంది సిట్టింగులకు కేసిఆర్ సీటు ఇవ్వడం లేదని, తేలింది. 15-20 మంది వరకు సీట్లు దక్కే అవకాశాలు లేవని ప్రచారం ఉంది. ఇక సీటు దక్కని వారితో ఆల్రెడీ బిఆర్‌ఎస్ అధిష్టానం టచ్ లోకి వెళ్ళి..సీటు దక్కడం లేదని చెబుతూ..రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని బుజ్జగిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే సీటు దక్కే అవకాశాలు లేని ఎమ్మెల్యేలకు వేరే పార్టీలు ఆఫర్లు ఇచ్చి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక బిఆర్‌ఎస్ లో సీట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు వచ్చి.. స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వరంగల్(తూర్పు), కల్వకుర్తి, నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు, వేములవాడ, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, నర్సాపూర్, జహీరాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో మార్పు జరుగుతాయని బిఆర్‌ఎస్ వర్గాల సమాచారం..అలా అని ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు దక్కకుండా ఉంటాయనేది చెప్పలేం. ఇందులో కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
ఇక ఏ ఏ నియోజకవర్గాల్లో ఆల్టర్నేట్ గా వచ్చే కొత్త అభ్యర్ధులు వస్తారంటే.. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి స్థానంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, ఖానాపూర్‌లో భూక్యా జాన్సన్ నాయక్‌కు, వేములవాడలో చెన్నమనేని రమేశ్ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, వరంగల్ తూర్పు బరిలో నన్నపనేని నరేందర్ స్థానంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
వైరాలో మదన్‌లాల్‌కు టికెట్ , స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి, జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే వీరే ఫైనల్ అవుతారని లేదు. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్ లో కొత్త అభ్యర్ధులు వస్తారో చూడాలి.