ఎడిట్ నోట్: జగన్ ‘రివర్స్’ స్ట్రాటజీ!

-

మరొకసారి గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో గెలిస్తే..ఈ సారి 175 స్థానాలు గెలవాలనే టార్గెట్ పెట్టుకుని జగన్ పనిచేస్తున్నారు. ఏదేమైనా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే జగన్ లక్ష్యంగా మారింది. ఈ క్రమంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడానికైనా జగన్ వెనుకాడటం లేదు. ప్రధానంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ వెనుకడుగు వేస్తున్నారు.

పనితీరు సరిగ్గా లేనివారికి సీటు ఇవ్వనని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు వర్క్ షాపులు నిర్వహిస్తూ..గడపగడపకు సరిగా వెళ్లని వారికి క్లాస్ ఇస్తూ..ఇకనైనా పనితీరు మెరుగుపర్చుకోవాలని, అలా చేయని పక్షంలో సీటు కూడా ఇవ్వనని కొందరికి చెప్పేశారు. అయితే అలా చెప్పడం వల్ల వైసీపీకి కాస్త ఇబ్బందిగా మారింది. సీటు దక్కదనే వారు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు.

అసలు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. అయితే వీరికి జగన్ సీట్లు ఇవ్వనని చెప్పలేదు..వీరికి సీట్లు ఉన్నాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వీరు వైసీపీకి దూరం జరిగారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి  టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు.

అయితే వీరికి సీటు ఇవ్వనని జగన్ ముందే చెప్పారు..పైగా వారి స్థానాల్లో అదనపు సమన్వయకర్తలని నియమించారు. దీంతో వారికి సీట్లు దక్కవని తెలిసి…టి‌డి‌పికి క్రాస్ ఓటు వేశారు. ఇంకా సీటు దక్కదనుకునే ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపు చూస్తున్నారన తెలిసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3న జరగనున్న వర్క్ షాప్ లో జగన్..సీట్లపై మాట్లాడే ఛాన్స్ లేదు. సీటు లేదని చెప్పే ఛాన్స్ ఉండదని తెలుస్తోంది. ఎన్నికల వరకు చూసి..అప్పుడు కొందరు సిట్టింగులకు షాక్ ఇస్తారని సమాచారం. మొత్తానికి జగన్ రివర్స్ స్ట్రాటజీతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news