సంక్షేమం..సంక్షేమం ఇదే జగన్ మంత్రం..అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్తితులు ఎలా అయినా ఉండని..పథకాలు మాత్రం ఆపలేదు..అప్పు చేయని, పన్నుల భారం పెంచని…ఏదొక విధంగా డబ్బులు రాబట్టడం..మళ్ళీ వాటిని పథకాల రూపంలో అర్హులైన ప్రజలకు ఇవ్వడం చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. అప్పుడే ఆ రాష్ట్రం ప్రగతి బాటలో వెళుతుంది.
కానీ జగన్ కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడంతో అభివృద్ధి కుంటుపడిందనే మాట వాస్తవం. దీని వల్ల కొన్ని వర్గాల్లో జగన్ వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. మామూలుగా జగన్ సంక్షేమ పథకాల అమలు వల్ల..పథకాల అందుతున్న వారి మద్ధతు పొందుతున్నారు. దాదాపు సగంపైనే సంక్షేమ లబ్దిదారుల మద్ధతు జగన్‌కే ఉంది. కానీ అభివృద్ధి లేకపోవడం వల్ల మెజారిటీ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ వ్యతిరేకతని పోగొట్టుకోవడానికే జగన్..రెండో కోణంలో వస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించి…రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నారు.
తాజాగా విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులని ఆకర్షించి సక్సెస్ అవ్వాలని జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. దాదాపు లక్ష కోట్ల వరకు పెట్టుబడులని ఆకర్షించాలని చూస్తుంది. దీని ద్వారా అభివృద్ధి అంశంలో కూడా మార్కులు కొట్టేసి..ఆ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతని కూడా పోగొట్టుకోవాలని జగన్ చూస్తున్నారు.
ఇప్పటికే విశాఖ సదస్సుకు అందరి మద్ధతు లభిస్తుంది. ఇటు జనసేన అధినేత పవన్ సైతం..పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు. అటు పక్కనే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటిఆర్ సైతం..ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో పెట్టుబడులని ఆకర్షిస్తుందో చూడాలి. దీని ద్వారా వైసీపీకి రాజకీయంగా ఎంత మైలేజ్ వస్తుందో కూడా చూడాలి