ఎడిట్ నోట్: కవితకు సుఖేష్‌తో చిక్కులు.!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం కవితని వదలడం లేదు..ఇప్పటికే రెండుసార్లు విచారణకు వెళ్ళిన కవితకు సుఖేష్ రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సుఖేష్..ఇప్పుడు ఆ స్కామ్ లో ఏం జరిగిందో విషయాలని వరుసగా బయటపెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటికే రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై) సంచలన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌షాట్లను రిలీజ్ చేసి కొత్త చర్చకు దారితీశారు.

అంతకముందే తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వాట్సప్ , టెలిగ్రామ్ లో చాట్ చేసిన 700 పేజీల లేఖను రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు రూ.75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఏకే అనే వ్యక్తికి ఇచ్చానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుఖేష్ లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది.

 WhatsApp Chat Kavitha

ఆ చాట్ లో ఏపీ, ఎస్‌జే, ఏ‌కే, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 15 కేజీల నెయ్యి డెలివర్ చేశానని సుఖేష్ కోడ్ భాషలో చెప్పినట్టు పేర్కొన్నాడు. మొత్తం 6 పేజీల లేఖతో పాటు కవితతో చాట్ చేసినా అని చెప్పుకునే స్క్రీన్ షాట్స్ ను రిలీజ్ చేశాడు.

సుఖేష్ రిలీజ్ చేసిన చాటింగ్…

సుఖేష్: AK బ్రదర్ ప్యాకేజి ఇవ్వాల్సి ఉంది.

అవును, ఓకే – (కవిత పేరుతో ఉన్న నెంబర్ నుండి వచ్చిన మెసేజ్)

సుఖేష్: దాన్ని JHకు పంపించాలా?

కవిత: నోనో, అరుణ్ ను నీకు కాల్ చేయమని చెబుతాను, దాన్ని ఆఫీస్ కు పంపించాలి.

సుఖేష్: ఒకే అక్కా.

కవిత: అతను నీకు కాల్ చేస్తాడు.

సుఖేష్: దాన్ని ఈరోజే మీకు పంపించాలని SJ బ్రదర్ చెప్పారు

కవిత : అవును.

సుఖేష్: నేను మొత్తం కోర్డినేట్ చేసుకుంటాను అక్కా.

కవిత: నాన్న ఆరోగ్యం ఎలా ఉంది.

సుఖేష్: థ్యాంక్స్ అక్కా..చికిత్స తీసుకుంటున్నారు.

కవిత: ఆయన బయటపడతారు.

సుఖేష్: ఓకే అక్కా..కేసీఆర్ గారికి నా నమస్కారాలు చెప్పండి.

సుఖేష్: అక్కా సరుకు డెలివరీ అయింది.

కవిత: ఓకే.

సుఖేష్: అక్కా కొంచెం AK లేదా SJకు చెప్పగలరు.

కవిత: మనీష్ తో మాట్లాడా.

ఇలా కవిత, సుఖేష్ ల మధ్య జరిగిన చాట్ బయటకొచ్చింది. అయితే దీనిపై కవిత స్పందిస్తూ.. బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం జరుగుతుందని, కేసీఆర్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక, తన మీద దాడి ఇలా జరుగుతోందని, ఫేక్ చాట్‌లతో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని, సుఖేశ్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని, అతను ఎవరో తనకు తెలియదని అన్నారు.

ఆ వెంటనే సుఖేష్‌ చంద్రశేఖర్ లీక్ చేసిన వాట్సాప్ చాట్స్, లెటర్ తో తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించడం చిన్నపిల్లల ప్రకటనలా ఉందని సుఖేష్‌ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ ఎద్దేవా చేశారు. ఇక ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అనంత్ మాలిక్ ఆరోపించారు. మొత్తానికి ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఇందులో నుంచి కవిత ఎలా బయటపడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news