ఎడిట్ నోట్: కేసీఆర్ ‘ఎన్టీఆర్’ ఫార్ములా.!

-

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి..ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్. అయితే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో గెలుపుపై కే‌సి‌ఆర్ ఫోకస్ పెట్టారు. 2014లో తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు. అలా అధికారంలోకి వచ్చి..ప్రతిపక్షాలని తోక్కేస్తూ..ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 2018 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడంపై ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి సులువుగా గెలవడం కష్టమే ఎందుకంటే ఓ వైపు బి‌జే‌పి, మరోవైపు కాంగ్రెస్ గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఈ సారి బి‌ఆర్‌ఎస్ సులువుగా గెలవలేదనే చెప్పాలి. కాకపోతే ప్రతిపక్షాల్ని వీక్ చేస్తూ కే‌సి‌ఆర్ ప్లాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రాన్ని బూచిగా చూపించి బి‌జే‌పిని దెబ్బకొట్టడానికి చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎలాగో అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతుంది.

ఈ క్రమంలో అధికారంలో ఉంటూ..ఆ బలాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఎన్నికల్లో సత్తా చాటాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా..ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఉన్నా సరే..వాటిని కవర్ చేస్తూ పార్టీని గెలిపించడానికి కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలతో ప్రజలని ఆకట్టుకుంటూనే..మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళుతున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అనుసరించిన ఫార్ములాని కే‌సి‌ఆర్ ఇప్పుడు అనుసరిస్తున్నారు. రూరల్ ప్రాంత ప్రజలైన..పట్టణ ప్రజలైన ఆకట్టుకోవాలంటే..రోడ్లు సౌకర్యం సరిగ్గా ఉండాలి. రోడ్లు దారుణంగా తిట్టే ముందు తిట్టుకునేది ప్రభుత్వాన్నే. కాబట్టి ముందు రోడ్లని బాగు చేసే పనిలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఉంది. ఇంకా తాగునీటి సౌకర్యం ప్రతి ఇంటికి అందేలా చేయడం. అలాగే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం..ఇవి ప్రజలకు అందేలా చేసి..వారి మద్ధతుని పొంది మూడోసారి అధికారంలోకి వచ్చేలా కే‌సి‌ఆర్ స్కెచ్ వేస్తున్నారు. మరి ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news