ఎడిట్ నోట్: కేటీఆర్ మార్క్.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి…ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలని మరోసారి దెబ్బకొట్టి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కే‌సి‌ఆర్..తనదైన శైలిలో అందరికంటే ముందే అభ్యర్ధులని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

అయితే కేంద్రం జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో..ఆ దిశగా కూడా కే‌సి‌ఆర్ వ్యూహాలు మార్చుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలుపే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ఇక కే‌సి‌ఆర్‌కు సపోర్ట్ గా అటు హరీష్..ఇటు కే‌టి‌ఆర్ రాజకీయం నడిపిస్తున్నారు. ఇదే క్రమంలో కే‌టి‌ఆర్ తనదైన మార్క్ తో ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకసారిగా మీడియాతో ఇంటారక్ట్ అయ్యి..ప్రతిపక్షాలని టార్గెట్ చేశారు. కాంగ్రెస్, బి‌జే‌పిలపై విరుచుకుపడ్డారు. పైగా తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించడానికి రెడీ అయ్యారని కే‌టి‌ఆర్ మాటల ద్వారా అర్ధమవుతుంది.

అటు కాంగ్రెస్‌కు రేవంత్, ఇటు బి‌జే‌పికి కిషన్ రెడ్డి పేరుకు మాత్రమే అధ్యక్షులు అని, కానీ రేవంత్ వెనుక ఆంధ్రా నేత కే‌వి‌పి రామచంద్రారావు ఉన్నారని, ఇటు కిషన్ రెడ్డిని నడిపించేది ఉమ్మడి ఏపీ మాజీ సి‌ఎం కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. అయితే మొన్నటివరకు రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారని అనేవారు. ఇప్పుడు రూట్ మార్చి కే‌వి‌పి ఉన్నారని అంటున్నారు.

తెలంగాణ పట్ల నరనరాన వ్యతిరేకతని నింపుకున్నవారు మనకు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. కే‌సి‌ఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పుకొస్తున్నారు. అయితే పక్కగా కే‌టి‌ఆర్ తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకొస్తున్నారని అర్ధమవుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ తో గెలిచారు. ఇప్పుడు అదే తరహాలో ముందుకెళుతున్నారు. కానీ ప్రజలు ప్రతి సారి సెంటిమెంట్‌కు పడతారా? లేక ప్రజా సమస్యలు, ఇతర అంశాల గురించి ఆలోచిస్తారా? అనేది చూడాలి. కానీ అభివృద్ధి, సంక్షేమం బాగా చేశామని బి‌ఆర్‌ఎస్ చెబుతోంది. మరి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే.

Read more RELATED
Recommended to you

Latest news