ఎడిట్ నోట్: ‘ఓవర్’ కాన్ఫిడెన్స్..!

-

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా ఉంటే ఎప్పటికైనా దెబ్బతినక తప్పదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇటు టి‌డి‌పి, అటు వైసీపీ సైతం ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు కాన్ఫిడెన్స్ ఎక్కువగానే ఉంటుంది..కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనే చెప్పాలి.

గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పంథాలో వైసీపీ ముందుకెళుతుంది. వరుసపెట్టి ప్రతి ఎన్నికలోనూ గెలవడం..ఇంకా తమకు తిరుగులేదు అనే విధంగా వైసీపీ రాజకీయం ఉంది. అన్నీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి..175కి 175 సీట్లు గెలిచేస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం ఎందుకు 175కి 175 గెలవలేమో చెప్పాలని అంటున్నారు. అయితే ఇలా అన్నీ సీట్లు గెలవడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. రాజకీయాల్లో ఇది సాధ్యం కాని టార్గెట్. అదే సమయంలో వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది..ప్రజలు ఇంకా వైసీపీని తిరస్కరిస్తారు..అందులో ఎలాంటి డౌట్ లేదని టి‌డి‌పి అంటుంది.

రాబోయేది టి‌డి‌పి ప్రభుత్వమే అని ఆ పార్టీ నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పైగా ఇప్పుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవడంతో టి‌డి‌పిలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. వైసీపీని ప్రజలు ఇంకా తిరస్కరించారని, నెక్స్ట్ తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నారు.

ఇక మూడు పట్టభద్రుల స్థానాలు టి‌డి‌పి గెలిచిన సరే ..తమకు తిరుగులేదనే విధంగా వైసీపీ ఉంది. అసలైన ఓటర్లు వేరుగా ఉన్నారని, ఈ మూడు గెలిస్తే గెలిచినట్లు కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు జగన్‌ని ఓడించే మగాడు ఎవరు లేరని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే ఎటు చూసుకున్న ఇరు పార్టీలు ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాయి. ఎవరి ధీమా వారికి ఉంది. మరి ప్రజలు చివరికి ఎవరి వైపు ఉంటారనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news