ఎట్టకేలకు ఢిల్లీ స్థాయి నుంచి జాతీయ పార్టీని నడిపించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ మధ్యే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఛాన్స్ దొరికింది. ఇక వెంటనే పార్టీని ప్రారంభించడం, ఢిల్లీకి వెళ్ళి పార్టీ ఆఫీసుని ప్రారంభించడం, జెండా ఎగరవేయడం చేశారు. ఇక ఇక్కడ నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాలు మొదలయ్యాయి. అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు విపక్ష పార్టీల నుంచి మద్ధతు వస్తుందని అంతా భావించారు.
కానీ ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి విపక్షానికి చెందిన కీలక నేతలు రాలేదు. చిన్న స్థాయి నేతలు మాత్రం వచ్చారు. అయితే ప్రస్తుతం ప్రారంభించింది తాత్కాలిక ఆఫీసు మాత్రమే..అసలు ఆఫీసు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అది పూర్తి అయ్యాక కీలక నేతలు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే తమ తమ రాష్ట్రాల్లో వచ్చి కేసీఆర్ రాజకీయం చేస్తుంటే విపక్ష నేతలు ఒప్పుకునే పరిస్తితి ఉంటుందా? కేసీఆర్‌కు సహకరిస్తారా? అనేది డౌటే.
ఒక్క కర్ణాటకలో మాత్రం జేడిఎస్ కాస్త చిన్న పార్టీ కాబట్టి..అక్కడ మాజీ సీఎం కుమారస్వామి..కేసీఆర్‌కు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మహారాష్ట్రలో ఎన్‌సిపి, శివసేన పార్టీలు పెద్దవి..అక్కడకెళ్లి బీఆర్ఎస్ పేరిట రాజకీయం చేస్తే..వారు సహకరించే పరిస్తితి ఉండదు. ఇటు తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెడితే సహకారం అందడం డౌటే. ఇక ఏపీలో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ రాజకీయంగా స్పేస్ కూడా లేదు.
అలాగే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అధికారంలో ఉన్న జగన్ సహకరించే పరిస్తితి లేదు. ఏదో తెలంగాణ వరకే సపోర్ట్ ఇస్తారు గాని..తమ రాష్ట్రాల్లోకి వచ్చి కేసీఆర్ రాజకీయం చేస్తానంటే ఒప్పుకునే పరిస్తితి ఉండదని చెప్పవచ్చు. అటు జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు సైతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కనిపించడం లేదు. తెలంగాణ వరకు మద్ధతు ఉన్నారు గాని..జాతీయ రాజకీయాల్లో మద్ధతు ఇచ్చే అంశంలో ఇంకా క్లారిటీ లేదు. ఎలా చూసుకున్న జాతీయ స్థాయిలో కేసీఆర్ బలపడటానికి మద్ధతు పెద్దగా దక్కకపోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకొస్తారో చూడాలి.