తెలంగాణలో జులై 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం

-

కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగం చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కరోనా వల్ల చాలా నష్ట పోయారు. అటు థర్డ్ వేవ్ కూడా పిల్లలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. లాగ్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని.. మాస్కులు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news