Eesha Rebba : మేకప్ లేకుండా ఈషా రెబ్బా మెస్మరైజింగ్ ఫొటోలు

-

తెలుగు భామ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్టూ చేస్తూ అభిమానులతో టచ్​లో ఉంటుంది. తాజాగా ఈషా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈషా తాజాగా పోస్టు చేసిన ఫొటోల్లో మేకప్ లేకుండా ఉంది. మేకప్ లేకపోయినా ఈషా చాలా అందంగా కనిపిస్తోంది. బ్లూ జీన్స్​లో పింక్ క్రాప్ టాప్​లో ఈషా అదిరిపోతోంది. సన్​లైట్​లో దిగిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకపోయినా ఈషా ఎంత ముద్దుగా ఉందో అంటూ పొగిడేస్తున్నారు. ఎంతైనా తెలుగమ్మాయిలు మేకప్ లేకపోయినా అందంగానే ఉంటారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఈషా రెబ్బా ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్​లపైనా ఫోకస్ చేస్తోంది. ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. మంచి స్టార్ట్ లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు. సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news