ఈషా రెబ్బ.. ఎద అందాలు చూసి తట్టుకోలేరబ్బా..హీరోయిన్ హాట్ ట్రీట్..

-

అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బ.. ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించినప్పటికీ ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఈ భామ రూటు మార్చింది. కీలక పాత్ర లభించినట్లయితే సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అంది. అలా పలువురు స్టార్ హీరోల పిక్చర్స్‌లో సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. ఈ క్రమంలోనే బోల్డ్ రోల్స్ ప్లే చేయడానికి కూడా సై అంది. అలా ఈమె పాపులారిటీ బాగా పెరిగింది.

డైరెక్ట్ ఓటీటీ రిలీజెస్ లో బోల్డ్ రోల్స్ ప్లే చేసింది ఈషారెబ్బ. నెట్ ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్ట కథలు’లో నటించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ ..‘త్రీ రోజెస్’లోనూ నటించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు మైమరిచిపోయే ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ బాగా పెంచేస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చూసిన ఫొటోలు చూసి కుర్రకారు తట్టుకోవడం కష్టమే అని చెప్పొచ్చు.

టైట్ డ్రెస్‌లో అలా క్లీవేజ్ అందాలను బయటకు కనిపించేలా ఫోజులు కొడుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ అందాల ఘాటును తట్టుకోవడం కొంచెం కష్టమేనని ఈ సందర్భంగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సిల్క్ బ్లాక్ కలర్ మిక్స్ డ్ డ్రెస్ లో అలా అద్దం వంక చూస్తూ, నడుము పై చేయి వాల్చి, అలా కొంటెగా చూస్తూ రకరకాల స్టిల్స్ ఇచ్చి కుర్రకారు మతి పోగొడుతోంది. ‘నా దృష్టి మీ మీద పడింది’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ హాట్ హీరోయిన్.

అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రంలో కెమియో అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సుందరి ప్రజెంట్.. మలయాళం, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ‘ఒట్టు’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా మాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఈషా రెబ్బ పరిచయం కాబోతుంది. ‘ఆయిరామ్ జెన్మంగల్’ అనే తమిళ చిత్రంలోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈషా రెబ్బ.

https://www.instagram.com/p/Cbr7qWcvfR8/?utm_source=ig_web_copy_link

 

 

Read more RELATED
Recommended to you

Latest news