చిన్నవాడయిన శ్రీరామ్ (పరిటాల వారింటి వారసుడు) తన కంటే కాస్త పెద్దవాడయిన జగన్ ను ఎదుర్కోవడం కష్టం. ఆ విధంగా కొంత ఇబ్బంది. సీమ రాజకీయాల్లో పరిటాల రవి ఇమేజ్ ను కాపాడుతున్న నేతగా పేరున్నా సాధించాల్సినంత సాధించలేకపోతున్నారు. అమ్మ పరిటాల సునీత గత సారి మంత్రిగా పనిచేశారు. కానీ ఆమె మార్కు కూడా పెద్దగా లేదు అన్న విమర్శ కూడా ఉంది. ఈ దశలో పరిటాల కుటుంబం కేవలం ఒకట్రెండు నియోజకవర్గాలకే పరిమితం అయి ఉంటుంది అని విమర్శ ఒకటి ఉంది. అదేవిధంగా రాజకీయంగా వైసీపీ బాగానే ఎదిగింది. ఆ ఎదుగుదల కారణంగానే పరిటాల వర్గంకు కష్ట కాలం వచ్చిందని కూడా అంటున్నారు. సీమ నాయకులంతా కాంట్రాక్టులు పొందడంలో ముందుంటారు అన్న వాదన ఒకటి ఉంది. ఆ విధంగా వైసీపీ పెద్దలు ఆర్థికంగా ఈ సారి బలోపేతం అయ్యారని టాక్. ముఖ్యంగా సీమలో గనుల తవ్వకమే ఓ పెద్ద లాభ సాటి వ్యాపారం. అందుకు వైసీపీ పెద్దలు ఎంతగానో సహకరించారు స్థానిక నాయకత్వాలకు..దీంతో వారంతా ఆర్థికంగా ఎదిగారు కనుక వీళ్లను దాటి పరిటాల శ్రీరామ్ రాజకీయం చేయాలనుకోవడం తప్పిదమే కావొచ్చు.
శ్రీరామ్ ప్రభావం శూన్యం
అనంత రాజకీయాల్లో ఆ రోజు టీడీపీ వీర విధేయుడిగా పరిటాల రవికి ఎంతో పేరుంది.ఆయన పేరు చెబితే హడలిపోయిన సందర్భాలు ఉన్నాయి. పరిష్కారం అయిన సమస్యలూ ఉన్నాయి.కానీ తరువాత కాలంలో శ్రీరామ్ పెద్దగా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారు. రాప్తాడు నియోజకవర్గ వ్యవహారాలతో పాటు అనంత జిల్లా రాజకీయాల్లో కూడా చక్కదిద్దేందుకు ఆలోచించే శ్రీరామ్ కు ఒకప్పటిలా హవా లేదు. అనంత రాజకీయాల్లో బాలయ్య కూడా ఉన్నారు. ఆ విధంగా బాలయ్య ఫోకస్ హిందూపురం పై ఉంది. కానీ మిగతా నియోజకవర్గాలలో ఆయనకు పట్టు లేదు. ఆ విధంగా జిల్లాను నడిపించే లీడర్లు తక్కువ ఇక్కడ.
కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం) లాంటి జర్నలిస్టులు నాయకులుగా మారినా ప్రయోజనం లేదు. ఇప్పుడాయన ఊసు కూడా ఎక్కడా లేదు.
టీడీపీకి మళ్లీ నో ఛాన్స్ !
ఏ విధంగా చూసుకున్నా అనంత రాజకీయాల్లో చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. జేసీ వర్గం మనుషులంతా అరుపులకే పరిమితం తప్ప జగన్ మోహన్ రెడ్డి వర్గాన్ని అడ్డుకునే శక్తి అయితే లేనే లేదు. జేసీ వారసులు కూడా పెద్దగా రాణించడం లేదు. ఓ విధంగా సీమలో ముఖ్యంగా కళ్యాణ దుర్గం లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి ఉన్నంత పట్టు టీడీపీకి లేదు. స్థానిక సమస్యల ప్రస్తావన, కరువు నివారణ వంటి వాటిపై కూడా టీడీపీ మాట్లాడడం లేదు. అంతర్గత విభేదాల కారణంగా టీజీ లాంటి లీడర్లు మీడియా ముందుకు వచ్చి అరిచివెళ్తున్నారు. (అవును ! ఆయన పేరుకే బీజేపీ ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు కానీ ప్రస్తుతం బాబు డైరెక్షన్లో అక్కడ ఉన్నారని వైసీపీ చేసే విమర్శ) ఒక్క మాటలో చెప్పాలంటే అనంత రాజకీయాలు టీడీపీకి కలిసి రావడం లేదు. వచ్చేసారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి!
నియోజకవర్గాల వారిగా…
గెలుపు మరియు ఓటమి
రాయదుర్గం లీడర్, సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి మళ్లీ పోటీ చేస్తే గెలుస్తారు. ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి పోటీ చేసినా కూడా గెలుస్తారు. ఉరవకొండ మాత్రం టీడీపీకి అనుకూలం (ప్రస్తుతానికి). గుంతకల్లు విషయానికే వస్తే వైసీపీ గెలుస్తుంది. తాడిపత్రి లో టీడీపీ గెలుస్తుంది. జేసీ సోదరుల అడ్డా ఇది. శింగనమలలో మాత్రం టీడీపీ అభ్యర్థిని అనుసరించి వైసీపీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అనంతపురం అర్బన్ లో ఈ సారి కూడా వైసీపీదే హవా ! కల్యాణ దుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి ఖాయం. రాప్తాడు లో టీడీపీ గెలవదు. పరిటాల శ్రీరామ్ గెలవడు అని తెలుస్తోంది. ఒకవేళ సునీత కనుక పోటీచేస్తే వైసీపీ తో ఆమె కు పోటీ హోరా హోరీగా ఉండనుంది. మడకశిర లో వైసీపీ గెలుపుపై కాస్త ఆశలున్నాయి. హిందూపురంలో బాలయ్య మళ్లీ గెలుస్తారు. పెనుకొండలో వైసీపీ గెలుపు ఖాయం. టీడీపీ అభ్యర్థి పార్థ సారథి అయితే మంత్రి శంకర నారాయణ గెలుపు ఖాయం. పుట్టపర్తిలో వైసీపీ గెలుపు సునాయాసం. ధర్మవరం లో వైసీపీ, కదిరిలో వైసీపీ (పోటాపోటీగా హోరాహోరీగా పోరు ఉంటుంది) కే ఛాన్స్.ఒకవేళ జనసేన,బీజేపీ, టీడీపీ త్రయం బరిలో ఉంటే లాభం వైసీపీకే క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ అభిమానులు అంచనా వేస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ లో వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ పీడీ రంగయ్య దే గెలుపు. హిందూపురం ఎంపీ స్థానం లో గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇస్తే టీడీపీ నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురుకానుంది. టీడీపీ అభ్యర్థి ప్రస్తుతానికి నిమ్మల కిష్టప్ప అనుకుంటున్నారు. ఈయన కనుక పోటీ చేస్తే వైసీపీ గెలుపు ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఒకవేళ ఆఖరి నిమిషయం సరైన అభ్యర్థిని మారిస్తే మాధవ్ గెలుపు పై అవకాశాలు ఎంతన్నవి చెప్పలేం అంటున్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలకులు.