రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిన తప్పులే చేస్తున్నారు: ఈటల

-

రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇంకోసారి విమర్శల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని ఇతర పార్టీ నాయకుల్ని కొనాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి పట్టిన గతే పడుతుందని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకి సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చెయ్యడంలో విఫలమైందని అన్నారు.

eetala revanth

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే వృధా అవుతుందని అన్నారు రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని అవ్వలేరని ఈటల జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని అన్నారు మూడోసారి మోడీ ప్రధాని అవుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version