ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఎన్నికల సంఘం శుభవార్త

-

ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడంపై స్వచ్ఛంద సంస్థలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఎన్నికల ప్రధాన అధికారి వికాస రాజ్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకొని వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. నివాస స్థలానికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేకున్నా, దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version