ఈజిప్టు, పాకిస్తాన్ దేశాల జీడీపీలు ఆయన ఆస్తి ముందు దిగదుడుపే..

-

ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అపరకుబేరుడిగా అవతరించాడు. టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల లాభాలతో ప్రపంచంలో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇటీవల టెస్లా షేర్లు ఒక్కసారిగా పెరగడంతో  ఒక్కరోజు లోనే 10 బిలియన్ డాలర్ల ఆస్తిని సంపాదించాడు. తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గురువారం నాటికి మస్క్ నికర ఆస్తుల విలువ 302 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొద్దిరోజుల క్రితం హెర్జ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే కార్‌ రెంటల్‌ సంస్థ సుమారు లక్ష టెస్లా కార్లకు ఆర్డర్‌ చేసింది. దీంతో ఎలాన్ మస్క్ ఆస్తి మరింతగా పెరిగింది. ఈ ఒప్పందం ఎలాన్ మస్క్ ను భూమిపై ఉన్న వాళ్లందరి కన్నా ఎక్కువ ధనవంతుడిని చేసింది. ఎలాన్ మస్క్ తర్వాతి స్థానంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 199 బిలియన్ డాలర్ల తో ప్రపంచంతో రెండో ధనవంతుడిగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆస్తి విలువ ప్రపంచంలోని కొన్ని దేశాల జీడీపీ కన్నా అధికం. ఈజిప్ట్, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, గ్రీస్, ఖతార్ మరియు ఫిన్లాండ్ వంటి దేశాల వార్షిక GDP కన్నా ఎక్కువ. మన దాయాది దేశం పాకిస్తాన్ వార్షిక జీడీపీ కూడా ఎలాన్ మస్క్ ఆస్తి కన్నా తక్కువే. పాకిస్థాన్‌ జీడిపీ కేవలం 280 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎలన్‌ మస్క్‌ సంపద పాకిస్థాన్‌ కంటే సుమారు 12 బిలియన్‌ డాలర్లు ఎక్కువ

Read more RELATED
Recommended to you

Latest news