చెదురుముదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓట్లు వేశారు. 86 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ పోలింగ్ పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఓటర్లు చైతన్యాన్ని చాటారని, కేసీఆర్ మార్గదర్శకత్వంలో, హుజూరాబాద్ ప్రజల ఆశిస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నాం అని అన్నారు. ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లు, కష్టపడ్డ కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు.
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రచారాన్ని ముందుండి నడిపించిది మంత్రి హరీష్ రావే. దాదాపుగా నాలుగున్నర నెలల నుంచి హుజూరాబాద్ లో మకాం పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా గ్రామగ్రామాన ప్రచారం చేశారు. ప్రతి పక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో హరీష్ రావు ప్రధాన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ఆయన క్రుషి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, సమర్థవంతమైన పోల్ మేనేజ్మెంట్ తో పోలింగ్ శాతం పెరిగినట్లు ఆ పార్టీ చెప్పుకుంటోంది.