జూబ్లీ హిల్స్‌ రేప్‌ కేసులో ఎన్ కౌంటర్ తప్పదా..నేడే నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ !

-

జూబ్లీహిల్స్‌ బాధితురాలిపై అత్యాచారం కేసులో నిందితులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాలకు వెళ్లారు పోలీసులు. అత్యాచారం చేసిన తరువాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టిన నిందితులు… పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. మే 31 వరకు వెయిట్ చేసిన నిందితులు.. 31 న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే సిటీ వదిలి వెళ్లారు. బంజారాహిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళ్ నాడు కు పరార్ కాగా.. మరో నిందితుడు గోవా కు పరారీ అయ్యాడు.

ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ కి పరారీ అయ్యాడు. నిందితులు తమ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయడం తో నిందితుల కుటుంబ సభ్యుల పై ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఏపీ, తమిళ నాడు, గోవా లలో వెతుకుతున్నారు. ఎట్టకేలకు 6 నిందితులను అరెస్ట్ చేసి కస్టడీ లో విచారిస్తున్నారు పోలీసులు… గ్యాంగ్ రేప్ కేస్ లో నేడు మైనార్ల విచారణ జరుగనుండగా.. A2 A3 A4 లను విచారించేందుకు జువైనల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కి మైనర్లు వెళ్లనున్నారు. జువైనైల్ హోంలోనే వారిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సాద్ధిదీన్ మాలిక్ ను విచారిస్తున్నారు. అలాగే.. ఈ రోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news