వరసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి ఎన్ కౌంటర్ మరవక ముందే మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. తాజాగా చత్తీస్గడ్ రాష్ట్రంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ పూర్ జిల్లా బహకేర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ కమాండర్ మరణించాడు. కాల్పుల్లో మావోయిస్టు 6వ కంపెనీ కమాండర్ సాకేత్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
శనివారం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. 26 మంది మరణించడ పోలీసులకు అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. మరణించిన మావోయిస్టులో అత్యంత కీలకమైన మిళింద్ తెల్తుంబ్డే ఉండటం గమనార్హం. ఎన్ కౌంటర్ అనంతరం గడ్చిరోలి చుట్టు పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, చత్తీస్గడ్ లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.