ఎన్‌టీఆర్‌, కేసీఆర్‌ మినహా మిగతావారంతా బ్రోకర్లే : మంత్రి ద‌యాక‌ర్ రావు

-

గ్రేటర్‌ వరంగల్‌ 35వ డివిజన్‌ శివనగర్‌లో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ అధ్య‌క్ష‌త‌న‌ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్‌, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్‌ పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మంత్రి ద‌యాక‌ర్ రావు ప్రసంగిస్తూ.. 40 ఏండ్ల‌ రాజకీయ జీవితంలో త‌న‌కు నచ్చిన ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్‌, కేసీఆర్‌ తప్ప మిగతావారంతా బ్రోకర్లేనని పేర్కొన్నారు.

రూ.400లు ఉన్న గ్యాస్‌ ధరను రూ.200 చేస్తానని నాడు మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.1250లు పెంచారని అన్నారు ఆయన. ధరలు పెంచినవారే ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. బ్రోకర్‌ మాటలు ఎక్కువగా మాట్లాడే నాయకులు బీజేపీలోనే ఉన్నారని హేళన చేశారు మంత్రి. కాంగ్రెస్‌ హయాంలో పెన్ష‌న్ రూ.200 ఉండేదని అయితే కొత్త పింఛన్‌ ఇవ్వాలంటే పింఛన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తేనే కొత్తవారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉండేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన మొత్తం దేశానికే ఆదర్శంగా ఉంది అని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లీ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version