నేనే అన్ని భూములు తీసుకుంటే.. కేసీఆర్ ఎన్ని ఎక‌రాలు క‌బ్జా చేశాడో : ఈటల

-

క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై సీఎం కేసీఆర్ కు ఈటల రాజేంద‌ర్ కౌంట‌ర్ ఇచ్చారు. మంత్రి స్థాయిలో ఉన్న నేనే బెదిరించి అసైన్డ్ భూమి తీసుకుంటే .. మరి సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ లో ఎన్ని వేల ఎకరాలు తీసుకొని ఉంటాడంటూ ఎద్దేవా చేశారు ఈట‌ల‌. అధికారులు పిచ్చోల్లా.. చట్టం ప్రకారం నడుచుకోవాలని… నేను భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య అని ఫైర్ అయ్యారు.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నాడని… చిన్న లొసుగును ఆధారం చేసుకుని 2014 లో టిడిపిని కేసీఆర్ మింగేశాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీని మింగేసాడని… చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా కేసీఆర్ చేశారని నిప్పులు చెరిగారు.

అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అమలు కావడం లేదు.. కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని.. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో మనిషి హోదాను బట్టి రేట్ నిర్ణయించి డబ్బు పంచారని తెలిపారు. 600 కోట్లను అక్రమ సొత్తును, 4 వేల కోట్లు సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేసి, పొలీస్ వ్యాన్లలో డబ్బు తెచ్చి పంచిన నీచ చరిత్ర కేసీఆర్ దని మండిప‌డ్డారు. ఏనాడు ఎంపిటిసీలను పట్టించుకోని వారికి కేసీఆర్ మల్లి టిక్కెట్లు ఇచ్చారని… స్వయంగా పోలీసు కమిషనర్, కలెక్టర్ బెదిరింపులకు గురి చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మండిప‌డ్డారు. నామినేషన్ వేసిన వాళ్ళను కేసులు పెట్టి విత్ డ్రా చేయించారని.. మండలి ఎన్నికల్లో ఓటు వేసి ఫోటో తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని మండిప‌డ్డారు. రాజ్యాంగ ఉల్లంఘన కు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news