రైతుల ఉసురు తో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది : ఈటల సంచలనం

-

తెలంగాణ రాష్ట్ర రైతుల ఉసురు తగులతదని..ఆ ఉసురుతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతి పూర్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావ్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని.. రైతు రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

మేము తక్షణ సాయంగా రూ 50 వేలు అందజేస్తున్నామని.. తెలంగాణ లో మోతుబరి రైతును నేను అని చెప్పే సీఎం కేసీఆర్ ..రైతులు చస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులను మోసం చేసున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. సీఎం కేసీఆర్ కు రైతుల పట్ల అవగాహన లేదని ఫైర్ అయ్యారు. వరి పంట వేయకూడదని సీఎం చెప్పడం హాస్యాస్పదమని.. వందురు పొలాలల్లో వరి తప్ప వేరే పంట పండదని సీఎం కేసీఆర్ కు తెలియదా ? అని నిలదీశారు.

ఏ వ్యవసాయం చేస్తే లాభసాటి గా ఉంటదో దాన్ని ప్లాన్ చేయాలని.. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటది.కేంద్రం బియ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. వర్షాకాలం వడ్లన్నీ వెంటనే కొనుగోలు చేయాలని.. యాసంగి లో వచ్చే పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని.. టిఆర్ఎస్ మొసలి కన్నీటిని నమ్మొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version