బండి సంజయ్ ఎపిసోడ్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని..ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్ కి ఇనుప కంచెలు, ఫార్మ్ హౌస్ కి గోడలు కట్టుకుని కేసీఆర్ ఉంటున్నాడని నిప్పులు చెరిగారు. సీఎం ఒక చక్రవర్తి ల ఎవరి మాట వినను అంటున్నారని… కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన సొంత కార్యాలయంలో జాగరణ కార్యక్రమం పెట్టుకున్నాడని మండిపడ్డారు.
శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణ ల కమిషనర్ వ్యవహరించారని.. సంజయ్ ని జైలు కి పంపించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ కేసులకు భయ పడదని.. ఇది బెంగాల్ కాదు…ఇది తెలంగాణ గడ్డ అని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు ఇక్కడ చేసిన పార్టీ బీజేపీ అని… హుజూరా బాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆగం ఆగం అవుతున్నావు.. కాళ్ళ కింద భూమి కదులుతుంది అని భయపడుతున్నాడని కేసీఆర్ కు చురకలు అంటించారు. నిర్బంధం తో ఏమి సాదించలేవని.. ఉద్యోగ సంఘాలు పట్టించుకోక పోవడం సమంజసం కాదు… నీరో చక్రవర్తి ల వ్యవహరిస్తున్న కేసీఆర్ ని కలవాలని కోరారు.