కరీంనగర్ జిల్లా వీణవంక (ఎల్భాక)లో ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..కెసిఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ తానే ఇప్పించానని ఆయన గెలవడానికి కూడా తానే వెళ్లి ప్రచారం చేశానని ఈటెల చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని అన్నారు. పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారని…. పెద్దపల్లికి వస్తా కాసుకో అంటూ ఈటెల సవాల్ విసిరారు.
కెసిఆర్ బొమ్మతో గెలుస్తా అనుకుంటున్నారని….ఇక ఆ బొమ్మకు ఓటు పడదు అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కెసిఆర్ నువ్వు నిజాం సర్కార్ కాదు…. ఇది నీ జాగీరు కాదు అంటూ ఈటెల వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నావు….2023లో టీఆరెస్ కథ కంచికే అంటూ ఈటెల షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరు అందుకుంది. టిఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారం లో దూసుకుపోతున్నాయి.