హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో మరిన్ని సేవలందించే దిశగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈవినింగ్ ఓపీ సేవలను ప్రారంభించారు వైద్యాధికారులు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ కు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులను పరీక్షించనున్నారు.
ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉదయం 7:30 నుంచే ఓపీ స్లిప్పుల పంపిణీ చేయాలి. ఉదయం 9 నుంచి వైద్యులు అందుబాటులో ఉండాలి. చివరి పేషెంట్‌కు వైద్యం అందించే ఓపీని కొనసాగాలి. రక్త పరీక్షలకు శాంపిల్స్ సేకరిస్తే, రిపోర్టు ఆ రోజే ఇవ్వాలి. ఓపీ సమయం కొనసాగుతున్నంత సేపు నమూనాల సేకరణ, రిపోర్టులు అందజేసే కౌంటర్లు పనిచేయాలని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌రావు. వీటన్నింటినీ సత్వరం అమలు చేయాలని ఆదేశించారు మంత్రి హరీశ్‌రావు.