కూల్ డ్రింక్స్ బాటిల్స్ నిండుగా ఎందుకు ఉండవో ఎప్పుడైనా గమనించారా?

-

కూల్ డ్రింక్స్ లేకుండా అసలు పార్టీ, ఫంక్షన్, పండగలు ఉండవు.. సరదా తాగడానికి మాత్రమే త్వరగా దాహాన్ని కూడా తీరుస్తాయి.అందుకే వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.అయితే దాదాపు చాలా కూల్ డ్రింక్స్‌ను నిండుగా నింపకుండా కాస్త తగ్గించి అందిస్తాయి కంపెనీలు..రేటు వేస్తే కనిపించడానికి అని చాలా మంది అనుకుంటారు. నిజానికి వేరే కారణం ఉందని నిపుణులు అంటున్నారు. అంత పెద్ద కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

సైంటిఫిక్ రీజన్ ప్రకారం, తక్కువగా డ్రింక్ నింపకపోతే బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఫ్లేవర్డ్ కార్బోనేటేడ్ వాటర్ అని చెప్పవచ్చు. అందుకే బాటిల్ లోపల ఒత్తిడి అనేది బయట ఒత్తిడి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల డ్రింక్ బాటిల్‌లో నుంచి బయటికి తన్నుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. అదే బాటిల్ పూర్తిగా నింపినట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్‌పై మరింత పెరుగుతుంది. ఈ ఒత్తిడి వివిధ రకాల ఉష్ణోగ్రతల్లో తారా స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంది.

అందుకే బాటిల్‌పై ఎలాంటి ప్రెజర్ పడకుండా బాటిల్‌లో కొంత ఖాళీ ఇస్తారు. అలా చెయ్యడం వల్ల డ్రింక్ లోని ఒత్తిడి బాటిల్ ఖాళీ స్పేస్‌పై మాత్రమే పడుతుంది కానీ బాటిల్‌పై పడదు.చాలా కోల్డ్ ప్రదేశాల్లో బాటిల్స్‌ను ఫిల్ చేస్తారు. ఈ సమయంలో డ్రింక్ అనేది దాదాపు ఘనీభవించిన స్థాయిలో ఉంటుంది. కానీ దీనిని సరఫరా చేస్తున్నప్పుడు అది రూమ్ టెంపరేచర్ తో పాటు తీవ్రమైన ఎండకి కూడా గురవుతుంది. అప్పుడు ఆ డ్రింక్ లో స్వల్ప మొత్తం గ్యాస్ లాగా మారుతుంది. ఈ గ్యాస్ బాటిల్ లోనే ఉండడానికి స్పేస్ ఇవ్వడం తప్పనిసరి. స్పేస్ ఇవ్వకపోతే ఈ గ్యాస్ బయటికి వెళ్లేందుకు బాటిన్‌ని కూడా పగలగొడుతుంది. అందుకే స్పేస్ ఇస్తారు..ఇంకా మరొక కారణం కూడా ఉంది.. ఆ డ్రింక్ టైమ్ ఉన్న వరకూ క్వాలిటీ, టెస్ట్ లో ఎటువంటి మార్పు ఉండదు.. అది ఆ బాటిల్ గ్యాప్ వెనుక ఉన్న అసలు రహస్యం.

Read more RELATED
Recommended to you

Latest news