మారేడుపల్లి మాజీ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు అయింది. రూ. లక్ష పూచీకత్తు తో నాగేశ్వరరావుకు హైకోర్టు మెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలపాటు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని హైకోర్టు షరతు విధించింది.కిడ్నాప్, అత్యాచారం కేసులో నాగేశ్వరరావు జైలుకెళ్లిన విషయం తెలిసిందే.
వనస్థలీపురం పరిధిలో మహిళపై అత్యాచారం, భార్యా భర్తల అపహరణ, బెదిరింపు, దాడి కేసులో జూలై నెలలో నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి బెయిల్ కోసం ఒక సారి హయత్ నగర్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో పిటిషన్లు వేయగా వాటిని తిరస్కరించారు. తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు లక్ష రూపాయల పూచికత్తుతో పాటు షరతులతో కూడిన బెయిల్ ఆయనకి మంజారు చేసింది.