తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు… ఏది చేసినా సంచలనమే. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. తనదైన రాజకీయ వ్యూహాలను అనుసరిస్తూ.. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా మలచడంలో సీఎం కేసీఆర్ ఎంతో సక్సెస్ అయ్యారు. అలాగే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన తనదైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చక్రం తిప్పుతున్నారు సీఎం కేసీఆర్.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక మాజీ ఎండి లక్ష్మీరాజం ను రాజ్యసభకు పంపించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో పదవీ కాలం పూర్తి కానున్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు స్థానంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం కావడంతో ఆ స్థానాన్ని సి ఎల్ రాజం తో భర్తీ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ పత్రిక ను.. తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు సీఎల్ రాజం. గతంలోనే ఈయనను రాజ్యసభకు పంపించాలని సీఎం కేసీఆర్ భావించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా… అది సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం ఆయనను రాజ్యసభకు పంపించే విధంగా స్కెచ్ వేస్తున్నారట గులాబీ బాస్.