గతేడాది పదవ తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు రిమాండ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. నారాయణ తరుపున కోర్టులో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్ర, గుంటూరు ప్రమోద్, గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు.
న్యాయమూర్తులు రవీంద్ర భట్, దీపంకర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది. గతంలో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ మెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు ఆ బెయిల్ రద్దు చేసి నారాయనను సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు స్టే ఇచ్చింది.