బీజేపీ “గంగ” మాట: నారాయణ ఇక కృష్ణా.. రామా..?

-

టీడీపీలో చంద్రబాబు ప్రవర్తనకు విసిగిపోయో, లోకేష బాబు చేష్టలకు నలిగిపోయో, స్వయంకృతాపరాధల ఫలితంగానో ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిన కొందరు నాయకులకు అటు వైకాపా, ఇటు బీజేపీ ల దగ్గర ఆశ్రయం దొరుకుతుందేమోనని ఆశ కలుగుతుంది! ఈ క్రమంలో గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు లేవు అని ఓమాదిరి క్లారిటీ వచ్చిన అనంతరం ఫ్యాన్ కిందకు తెచ్చుకుంటున్నారు జగన్! అలా కాకుండా టీడీపీ లో గెలిచిన ఎమ్మెల్యేలను మాత్రం అనధికారికంగా సైకిల్ దింపినా.. అధికారికంగా వైకాపాలో చేర్చుకోకుండా తనదైన రాజకీయం చేస్తున్నారు.

ఈ క్రమంలో… గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు, నాయకులు కొందరు వైకాపా లో చేరిపోదామని చూస్తున్నారంట. అయితే… గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం మకిలి ఉన్నా కూడా రానిచ్చేది లేదని జగన్ భీష్మించుకుని కూర్చోడంతో… వారికి బీజేపీ ప్రత్యామ్నాంగా కనిపిస్తుందని అంటున్నారు.

గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా బీజేపీలో చేరిపోవడంతో… వీరికి మరింత ఆశ, నమ్మకం కలుగుతోందట! దీంతో… కమలంతోనే మా ప్రయాణం అన్నట్లుగా ఉందట వారి ఆలోచన!

ఈ క్రమంలో… అవినీతి మచ్చలేకుండా జాగ్రత్త పడుతు పాలిస్తున్న మోడీ నాయకత్వంలో పనిచేసేవారు కూడా అలానే ఉండాలని భావిస్తోన్న బీజేపీ అధిష్టానం.. ఇకపై అలాంటి వారికి అవకాశాలు ఇవ్వొద్దని భావిస్తోందట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా వచ్చి చేరి.. తమ పాపాలు కడిగేసుకున్నామని అనుకోవడానికో, ఆ పాపాలన్నీ పోయాయని భ్రమించడానికో.. బీజేపీ గంగానది కాదని సెలవిస్తున్నారట.

దీంతో చాలా మంది నేతలకు… ప్రముఖంగా గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు పుష్కలంగా ఎదుర్కొని, రేపో మాపో జగన్ ఏమి చేస్తాడో అన్న బెంగతో ఉన్న నాయకులకు ఎదురుదెబ్బ తగిలిందనే అంటున్నారు! ఈ క్రమంలో… మాజీ మంత్రి నారాయణ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీలో ఉన్నా ప్రయోజనం లేని పరిస్థితి… వీరందరినీ కాపాడటం సంగతి దేవుడెరుగు.. ప్రస్తుతం బాబు తనను తాను కాపాడుకునే పనిలో ఉన్నారు! ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా వద్దంటోంది… బీజేపీ రావొద్దంటోంది! ఈ పరిస్థితుల్లో కష్టమో నష్టమో దేవుడిపై భారం వేసి కృష్ణా.. రామా.. అనుకుంటే బెటరనే ఆలోచనలో నారాయణ ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news