నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ BRS లో ఎమ్మెల్సీ గా ఉన్న సీనియర్ ఎంత తుమ్మల నాగేశ్వరావు రాజకీయంగా ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నాడు. ఈ మధ్యనే వచ్చే ఎన్నికలలో కేసీఆర్ సీట్లను ప్రకటించగా అందులో తుమ్మల నాగేశ్వరరావు కు సానుకూలంగా అధిష్టానం లేకపోవడంతో నిరాశ చెందిన తుమ్మల పార్టీ నుండి బయటకు వచ్చేశాడు. గత ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా ఓడిపోయినా కేసీఆర్ ఎమ్మెల్సీని చేశాడు. దీనితో అతన్ని కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే తుమ్మల నాగేశ్వరరావు తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు మల్లు రవి భేటీ అయ్యి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలాసేపు రాష్ట్ర రాజకీయాలు గురించి మరియు భవిష్యత్తు గురించి తుమ్మల తో రేవంత్ రెడ్డి మరియు మల్లు రవి చర్చించినట్లు తెలుస్తోంది.
BREAKING: కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు … !
-