విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు పనికి రాడు – పాక్‌ మాజీ క్రికెటర్‌

-

ఆసియా కప్‌ సూపర్‌ 4 లో భాగంగా ఇవాళ.. భాగంగా టీమిండియాతో పాక్‌ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ల దాటిగా ఆడటం కోహ్లీకి చేతకాదన్నాడు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు పనికిరాదని అతని బ్యాటింగ్ శైలి వన్డే ఫార్మాట్ కు సరిగ్గా సరిపోతుందన్నాడు. అతని స్లో బ్యాటింగ్ కారణంగానే ఐపీఎల్ లో ఆర్ సి బి టైటిల్ అందుకో లేకపోయిందన్నాడు. ఆసియా కప్ 2022 లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, అజెయ ఆఫ్ సెంచరీ తో రాణించాడు.

అయితే ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. దాంతో అతని బ్యాటింగ్ తీరును రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ ఎప్పటికీ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మల దాటిగా ఆడలేరు. విరాట్ కోహ్లీ ఇలా నెమ్మదిగా ఆడడం వల్లే ఆర్ సి బి ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఎందుకంటే అతనికి ఇన్నింగ్స్ స్పీడ్ పెంచడం రాదు. మహేంద్రసింగ్ ధోని కూడా కొన్ని డాట్ బాల్స్ ఆడేవాడు. కానీ, ఆ తర్వాత కొన్ని సిక్సర్లు కొట్టి లెక్క సరిచేసేవాడు. విరాట్ కోహ్లీకి మాత్రం ఇది చేతకావడం లేదు. కాబట్టి హాంకాంగ్ పై అతను ఎలా ఆడాడనే దాని గురించి చర్చ అవసరమన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news