తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం.. గాంధీలో ఇకనుంచి ఆ సేవలు

-

తెలంగాణ వైద్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్ప‌త్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసిన‌ట్లు ఆ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు.. కంటి సమస్యలున్నవారు చికిత్స కోసం గాంధీకి రావాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు డాక్టర్ రాజారావు. కరోనా కారణంగా హాస్పిట‌ల్‌లో ఉన్న ఆప్తమాలజి విభాగంలో ఆపరేషన్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాన్‌కోవిడ్‌ సేవలు పున:ప్రారంభమైన క్రమంలో కంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ‘కాటరాక్ట్‌’ సర్జరీలను అంటే కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించే ఆపరేషన్‌లను ప్రారంభించినట్లు వెల్లడించారు డాక్టర్ రాజారావు.

Accident survivor waits 25 days at Gandhi Hospital for surgery

ఇందుకోసం మూడవ అంతస్తులో ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌తో పాటు 20 పడకలను కంటి రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు డాక్టర్ రాజారావు. ఆప్తమాలజి విభాగం ఆధ్వర్యంలో ఇక నుంచి కంటి సమస్యలకు సంబంధించి ఓపి సేవలతో పాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని ఆప్తమాలజి విభాగాధిపతి డాక్టర్‌ రవిశేఖర్‌తో కలిసి డాక్టర్‌
రాజారావు బుధవారం మీడియాకు వివరించారు. కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు ఉన్నవారు గాంధీ దవాఖాన ఆప్తమాలజి విభాగాన్ని ఆశ్రయించాల్సిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు డాక్టర్ రాజారావు.

 

Read more RELATED
Recommended to you

Latest news