రోజూ ఏదో ఒక చోట స్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటి పలు అత్యాచార కేసుల్లో నిందితులకు పడిన శిక్షలు చూసైనా కామాంధుల వెన్నులో వణుకుపుట్టడం లేదు. తమ కామవాంఛ తీర్చుకోవడానికి వీలైనన్నీ అడ్డదారులు తొక్కుతు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ఓ యువతి (21)పై లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఎస్‌యూవీ నుంచి దూకిన యువతికి గాయాలైన ఘటన లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద చోటు చేసుకుంది. జరిగింది. సహచరుడే ఈ దారుణానికి ఒడిగట్టడంతో తనను తాను కాపాడుకునేందుకు యువతి కారు నుంచి బయటకు దూకడంతో అటుగా వెళుతున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.
కోలుకున్న అనంతరం యువతి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోటల్‌లో
పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు తన మేనకోడలు కూడా హోటల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆమెకు సాయం చేయాలని కోరాడు. యువతి ఇంటి నుంచి హోటల్‌కు వెళుతుండగా తాను కారులో డ్రాప్ చేస్తానని లిఫ్ట్ ఆఫర్ చేశాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో షాక్‌కు గురైన బాధితురాలు ఎస్‌యూవీ నుంచి కిందకు దూకింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.